Kovur: పదవుల కోసం కాదు.. సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం

Kovur: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

Update: 2026-03-31 15:56 GMT

Kovur: పదవుల కోసం కాదు.. సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం

Kovur: రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Tags:    

Similar News