Kurnool: ఏపీ బడ్జెట్ లక్ష్యం మూలధన వ్యయం పెంపు.. మంత్రి టీజీ భరత్
Kurnool: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, బడ్జెట్ కేటాయింపులపై మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kurnool: ఏపీ బడ్జెట్ లక్ష్యం మూలధన వ్యయం పెంపు.. మంత్రి టీజీ భరత్
Kurnool: రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ను (మూలధన వ్యయం) పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి వివరించారు.
గత 20-21 నెలల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సంక్షేమం కూడా అమలు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా రెవెన్యూ పెంచుతూ, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (Capital Expenditure) పెంచేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. కర్నూలు కార్పొరేషన్ లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు రూ. 142 కోట్ల రూపాయల పనులు జరిగాయన్నారు.
పత్తికొండ వద్ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు పనులు జరుగుతున్నాయని ..అదేవిధంగా కూడా ఎమ్మిగనూరులో ఏపీఐఐసీ ద్వారా రెండవ దశ పనులు కూడా జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపుల గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన తప్పనిసరి అని మంత్రి తెలిపారు.