ఆ పాపంలో నేను కూడా భాగస్వామినే.. అందుకే 15 ఏళ్లు..

Update: 2019-12-10 05:38 GMT
తమ్మినేని సీతారాం

ఏపీ శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో అప్పుడు చేసిన పాపంలో తాను భాగస్వామినేనని అంగీకరించారు. ఎన్టీఆర్‌ను గద్దె దింపిన పాపంలో తాను భాగస్వామినే అని స్పీకర్ తమ్మినేని అన్నారు. అందుకే తాను 15 ఏళ్లు అధికారానికి దూరం ఉన్నానని చెప్పారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై విచారిస్తున్నానని అన్నారు. శాసనసభ స్పీకర్ గా సభ్యులందరికీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన పరిమితులు, అధికారాలు తనకు తెలుసన్నారు తమ్మినేని. స్పీకర్‌గా తనకున్న అధికారాలతోనే టీడీపీ ఎమ్మెల్యే వంశీకి మాట్లాడే అవకాశం కల్పించానన్నారు.

సభ ప్రారంభం అవ్వగానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో వంశీకే కాదు గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు సైతం సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. అవును సభలో ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆ సమయంలో తాను టీడీపీలోనే ఉన్నానని ఆ పాపంలో తాను భాగస్వామినేనని చెప్పుకొచ్చారు. దాని ఫలితమే తాను 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసారు.

Tags:    

Similar News