సీఎం ఇంటికి వెళ్లే దారుల్లో భారీ బందోబస్తు.. కారణమిదే..!

CM Jagan: తాడేపల్లి సీఎం ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Update: 2023-02-11 08:02 GMT

సీఎం ఇంటికి వెళ్లే దారుల్లో భారీ బందోబస్తు.. కారణమిదే..!

CM Jagan: తాడేపల్లి సీఎం ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్‌ అభ్యర్థులు యత్నించారు. 5 మార్కులు కలపాలని రాత పరీక్షలో ఫెయిలైన కానిస్టేబుల్‌ అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకుని, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సీఎం ఇంటికి వెళ్లే దారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ను నిర్వహించారు. దాదాపు 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈనెల 5న ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల్లో 99వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే కటాఫ్‌ మార్కులు తగ్గించాలని, దీనివల్ల మరికొంతమంది ఈవెంట్లకు అర్హత సాధిస్తారని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News