Atmakur: వ్యాపారాల నడుమ అంబేద్కర్.. ఆత్మకూరు బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Atmakur: ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ అక్రమ ఆక్రమణలు. చిరు వ్యాపారుల జోరుతో కనుమరుగవుతున్న విగ్రహం.
Atmakur: వ్యాపారాల నడుమ అంబేద్కర్.. ఆత్మకూరు బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!
ఆత్మకూరు (నెల్లూరు జిల్లా): ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ అక్రమ కట్టడాలు, చిరు వ్యాపారాల జోరు పెరిగిపోవడంతో మహనీయుని విగ్రహం కనుమరుగవుతోంది. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా, అందరికీ స్పష్టంగా కనిపించే అంబేద్కర్ సెంటర్, ఇప్పుడు వివాదాలకు నిలయంగా మారింది.
మున్సిపల్ బస్టాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ విగ్రహం చుట్టూ చిరు వ్యాపారులు పుట్టగొడుగుల్లా వెలిశారు. విగ్రహం చుట్టూ బండ్లు, షాపులు ఏర్పాటు చేయడంతో విగ్రహం అసలు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో మహానుభావుని కీర్తిని చాటేలా ఉన్న ఈ ప్రాంతం, నేడు వ్యాపార లావాదేవీల నడుమ నలిగిపోతోంది.