Anam Ramanarayana Reddy: సజీవ దహనం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది!

Anam Ramanarayana Reddy: మార్కాపురం రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి.

Update: 2026-03-26 10:12 GMT

Anam Ramanarayana Reddy: సజీవ దహనం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది!

Atmakur: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో అది పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను ఎంతో కలచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News