MLA Kakarla Suresh: బాధితులకు ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా!

MLA Kakarla Suresh: మార్కాపురం బస్సు ప్రమాదంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిగ్భ్రాంతి. నియోజకవర్గ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.

Update: 2026-03-26 09:58 GMT

MLA Kakarla Suresh: బాధితులకు ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా!

మార్కాపురం జిల్లా: రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్రంగా కలచివేసిందని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు తెలిపారు. టిప్పర్ మరియు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు దుర్మరణం చెందడం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్యసాయం అందేలా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో సుమారు పది మందికి పైగా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వారు ఉన్నట్లు తెలిసిందని, కానీ వారికి ప్రాణపాయ స్థితిలో లేరని, వారిలో 9 మంది గాయాల పాలయ్యారని, ఒకరి ఆచూకీ ఇంకా తెలియలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags:    

Similar News