Vizianagaram: రైతన్నలకు అండగా యువనేత.. పశువులకు టీకాలు వేసి మందుల పంపిణీ!

Vizianagaram: మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహణ.

Update: 2026-03-26 09:04 GMT

Vizianagaram: రైతన్నలకు అండగా యువనేత.. పశువులకు టీకాలు వేసి మందుల పంపిణీ!

Vizianagaram: మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ - మెరకముడిదాం వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి, రైతులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పశుపోషణపై ఆధారపడే రైతులకు సాంకేతిక మరియు వైద్య సాయం అందించడం అభినందనీయమని అన్నారు. మార్కెట్ కమిటీ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామంలోని పాడి రైతులు అధిక సంఖ్యలో తమ పశువులతో ఈ శిబిరానికి తరలివచ్చి వైద్య సేవలు పొందారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News