Ponguru Narayana: సజీవ దహనంపై మంత్రి నారాయణ విచారం.. నెల్లూరు అధికారులకు కీలక ఆదేశాలు

Ponguru Narayana: మార్కాపురం బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి. నెల్లూరు, ప్రకాశం కలెక్టర్లతో సమీక్ష.

Update: 2026-03-26 08:34 GMT

Ponguru Narayana: సజీవ దహనంపై మంత్రి నారాయణ విచారం.. నెల్లూరు అధికారులకు కీలక ఆదేశాలు

Ponguru Narayana: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరం అన్నారు. మార్కాపురం జిల్లా, ప్రకాశం జిల్లా,నెల్లూరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు మంత్రి పొంగూరు నారాయణ.

మృతుల వివరాలు, క్షతగాత్రుల వివరాలతో పాటు, ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు మంత్రికి తెలిపారు అధికారులు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి నారాయణ. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

గత సంవత్సర కాలంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం తీసుకుంటున్న సేఫ్టీ మెజర్మెంట్స్ పై దృష్టి సారించింది. ముఖ్యంగా నేడు ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు నెల్లూరు జిల్లా ది కావడంతో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తరచుగా జరుగుతున్న బస్సు అగ్ని ప్రమాదాలపై పరిశీలన మొదలుపెట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్ మీద నమ్మకంతో లక్షల మంది ప్రయాణికులు ప్రతి దినం. ముఖ్యంగా నెల్లూరు నుండి హైదరాబాద్. బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ లో వేలాదిమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు.. కానీ జరుగుతున్న వరుస ప్రమాదాలు దృష్ట్యా అధికార యంత్రాంగం ముఖ్యంగా రవాణా వ్యవస్థ అలెర్ట్ అయింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టే దిశగా దృష్టి సారించింది.

Tags:    

Similar News