Nellore: దొంగల చేతికి చిక్కిన తపాలా స్టాంపులు.. ఉదయగిరిలో సంచలన ఘటన!

Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి పోస్ట్ ఆఫీస్‌లో భారీ చోరీ. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. ఆర్డీ నగదుతో పాటు కీలకమైన డే స్టాంపులు మాయం.

Update: 2026-03-26 08:55 GMT

Nellore: దొంగల చేతికి చిక్కిన తపాలా స్టాంపులు.. ఉదయగిరిలో సంచలన ఘటన!

నెల్లూరు జిల్లా: ఉదయగిరిలోని తంతి తపాలా కార్యాలయంలో (పోస్ట్ ఆఫీస్) సంచలన చోరీ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి గుర్తు తెలియని దుండగులు కార్యాలయంలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది తలుపులు తెరిచి చూడగా లోపల వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. కార్యాలయంలోని తాళాలు బలవంతంగా పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీలో ఒక పోస్ట్‌మన్‌కు చెందిన ఆర్డీ నగదు సుమారు రూ.7 నుండి 10 వేల వరకు, అలాగే తపాలా శాఖకు సంబంధించిన రెండు డే స్టాంపులు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దుండగుల ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు. ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News