Sajjala Ramakrishna Reddy: ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో..

Sajjala Ramakrishna Reddy: ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది ఇప్పటినుంచే ప్రజల్లో నాన్చడానికి పొత్తులు అంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.

Update: 2022-05-09 16:00 GMT

Sajjala Ramakrishna Reddy: ఈ బంధం ఈ నాటిది కాదు.. ఏ నాటిదో..

Sajjala Ramakrishna Reddy: ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది ఇప్పటినుంచే ప్రజల్లో నాన్చడానికి పొత్తులు అంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. చంద్రబాబు జీవితమే పొత్తుల మయం అయిందన్నారు. చంద్రబాబు ఒకపక్క త్యాగం అంటున్నాడు మరో పక్క లీడ్ చేస్తాను అంటున్నాడు. ప్రజలంటే వీళ్ళకి లెక్కలేని తనం కనిపిస్తుందని సజ్జల మండిపడ్డారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు కానీ అది సాధ్యం కాదన్నారు.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతుందని సజ్జల అన్నారు. వీళ్ళ బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లు చీల కూడదని పవన్ ఒంటరిగా పోటీ చేశాడని సజ్జల అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని చంద్రబాబు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు.

Similar News