Pothina Mahesh: పవన్‌కు బిగ్ షాక్.. జనసేనకు పోతిన మహేష్ రాజీనామా
Pothina Mahesh: పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతిన మహేష్
Pothina Mahesh: పవన్‌కు బిగ్ షాక్.. జనసేనకు పోతిన మహేష్ రాజీనామా
Pothina Mahesh: జనసేన పార్టీకి పోతిన మహేష్ షాకిచ్చారు. తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న మహేష్.. పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. అయితే పొత్తుల కారణంగా బీజేపీ నేత సుజన చౌదరికి టికెట్ దక్కింది.
ఈ నేపథ్యంలో అసంతృప్తిలో ఉన్నారు పోతిన మహేష్. భవిష్యత్ కార్యాచరణపై పలు దఫాలు కార్యకర్తలు, అనుచరులతో భేటీలు నిర్వహించిన ఆయన.. ఇవాళ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.