చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

Update: 2019-11-08 09:39 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నిరాహరదీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతించాలని నగర పోలీస్, మున్సిపల్ కమిషనర్లను టీడీపీ కోరింది. అయితే, ఆయన దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇక్కడ అనుమతి ఇవ్వలేవని వారు తెలిపారు. పోలీసులు అనుమతి ఇవ్వలేకపోయినా చంద్రబాబు దీక్ష చేసి తీరుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ధర్నాచౌక్ ను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News