ఎమ్మెల్యే రాపాక పార్టీలో ఉన్నారో లేదో తెలియదు: పవన్ కళ్యాణ్

ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో తెలియడం లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Update: 2020-02-02 04:35 GMT

ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో తెలియడం లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నాయకులతో శనివారం పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ఈ వాఖ్యలు చేశారు. అయినా తాను కాపలా కాసుకొని కూర్చొనే రాజకీయాలు చేయలేనని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చి, ఇప్పుడు తన పద్ధతి బాగులేదని వెళ్ళిపోయే వారి మాటలను తానూ పట్టించుకోనని, ఇష్టంతో పార్టీలో ఉండాలి కానీ బలవంతంగా పార్టీలో ఉండమని ఎవరికీ తానూ చెప్పానని పవన్ అన్నారు. కేవలం ప్రజా ప్రయోజనాలు, సమాజహితం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అధికారం కోసం మాత్రం తాను అర్రులు చాచనని, అడ్డదారులు తొక్కబోనని, ఎవరి మోచేతి నీళ్లు తాగనని పవన్ వెల్లడించారు.

ఇక ఏ ఆశయంతోనైతే పార్టీ పెట్టానో ఆ ఆశయం సాధించి తీరుతానని తెలిపారు. కష్టాలు, నష్టాలను భరిస్తానుగాని, విలువలు, జనసైనికుల నమ్మకాలను మాత్రం పోగొట్టుకోనని హామీ ఇచ్చారు. ఇక నా పై ఆధారపడ్డ కుటుంబాల కోసం, నా కుటుంబాల కోసం సినిమాలు చేస్తున్నాను తప్ప, నాకు సినిమాలు చేయడం లేదని పవన్ వెల్లడించారు. రాజకీయాల్లో అడ్డదారులు తొక్కి నా కుటుంబాన్ని పోషించుకోలేనని, అలా చేస్తే నా మీదా నాకే గౌరవం పోతుందని పవన్ అన్నారు.

ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఖరి గురించి ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.. జనసేన ఎమ్మెల్యే అయి ఉండి వైసీపీకి మద్దతు ఇస్తుండడం పట్ల పార్టీ నాయకత్వం అయనపైన సీరియస్ గా ఉంది. ఈ నేపధ్యంలో పవన్ చేసిన వాఖ్యలు ఆసక్తిని సంతరిచుకున్నాయి.


Tags:    

Similar News