టీటీడీ ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ కానున్నారు. త్వరలో టీటీడీ ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను నియమించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించే అవకాశం ఉంది. జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులో సతీష్ చందర్ ను ప్రభుత్వం నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబు హయాంలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఆయన బదిలీ ఉత్తర్వులు మరికాసేపట్లో విడుదల కానున్నట్లు సమాచారం.