Balakrishna: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ..
Balakrishna: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Balakrishna: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ..
Balakrishna: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు అమ్మ వారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని బాలకృష్ణకు అందించారు. శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నానని బాలకృష్ణ చెప్పారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులపై ఉండాలని, రాష్ట్రాభివృద్ది జరిగి, ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు.