శ్రీవారి ఆభరణాల మాయం నిజమే.. విచారణలో నిగ్గుతేల్చిన అధికారులు !

Update: 2020-01-10 09:47 GMT
శ్రీవారి ఆభరణాల మాయం నిజమే.. విచారణలో నిగ్గుతేల్చిన అధికారులు !

తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ఆధ్యాత్మిక ధామం. భక్తులందరి కోర్కెలు తీర్చే దేవస్థానంగా విరాజిల్లుతోంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అసలు విషయానికి వస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో లక్షల విలువైన నగల మాయం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే శ్రీవారి ఆలయంలో లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు మాయం వాస్తవమేనని అధికారుల విచారణలో తేలింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ ఏఈఓగా శ్రీనివాసులు ఉన్న సమయంలోనే ఈ నగలు మాయమైనట్లు టీటీడీ నియమించిన విచారణ కమిటీ స్పష్టం చేసింది. 5 కిలోల బరువు ఉన్న వెండి కిరీటం, బంగారు నాణాలు రెండు ఉంగరాలు నెక్లెస్ కనిపించకుండా పోయాయని కనిపించకుండా పోయిన ఆభరణాల విలువ ఏకంగా 7.36 లక్షలు ఉంటుందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపితమైన తర్వాత 2018 నుంచి ఆయన వేతనంలో నెలకు 25 వేల రూపాయల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించింది.

నగల గల్లంతుతో తనకు సంబంధం లేదని, మరోసారి పునఃపరిశీలించాలని అప్పటి ఏఈవో ఆరు నెలల క్రితం ఉన్నతాధికారులను కోరారు. టీటీడీ సెప్టెంబరులో విచారణ ప్రారంభించి ఇటీవల పూర్తి చేసింది. మాయమైన ఆభరణాలు కనిపించలేదని విచారణ అధికారులు నిర్ధారించారు. అప్పటి ఏఈవో నుంచి జరిమానా వసూలును కొనసాగించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.


Full View


Tags:    

Similar News