మార్షల్స్‌ను గోర్లతో రక్కారు : పేర్ని నాని

Update: 2019-12-13 05:31 GMT
పేర్ని నాని

ఏపీ అసెంబ్లీలో మార్షల్స్ దాడి అంశం కలకలం రేపింది. అసెంబ్లీ గేటు దగ్గర గురువారం మార్షల్స్‌పై దాడి ఘటనను ఎథిక్స్ కమిటీకి పంపే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని మంత్రి పేర్ని నాని అన్నారు.

శుక్రవారం మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీలో మార్షల్‌పై టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులు కానివారిని లోనికి అనుమతించరని టీడీపీ సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. అధినేత మెప్పుకోసం టీడీపీ నేతలు తాపత్రయపడ్డారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసెంబ్లీ అధికారులను టీడీపీ సభ్యులు దూషించారని, ఇండియట్స్ అని తిట్టారని చెప్పారు. మార్షల్స్‌ను గోర్లతో రక్కారని మార్షల్స్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News