ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు టీడీపీ నేత మరియు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జగన్ వంద రోజుల పాలనకి గాను 150 మార్కులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఎప్పటికి మా అబ్బాయేనని కానీ పాలనలో కింద మీదా పడుతున్నాడని జేసి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నప్పటికీ అయనకి మాత్రం తమ బస్సులే కనిపిస్తున్నాయని, ఇప్పటి వరకు మొత్తం 31 బస్సులు సీజ్ చేశారన్నారు. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం సరైనది కాదని అయన అన్నారు. దీనిపైన న్యాయంగా పోరాడతామని చెప్పుకొచ్చారు.. బుధవారం మీడియాతో మాట్లాడిన జేసీ ఈ వాఖ్యలు చేసారు.