పుస్తక పఠనం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయవాడలో పుస్తకప్రదర్శనను సందర్శించిన పవన్ కల్యాణ్ మాతృ బాషను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన వారి బాషను సంరక్షించుకుంటున్నారన్నారు. ఇంగ్లీష్ భాష అవసరమే కానీ తెలుగును చంపకూడదన్నారు. తెలుగు బాష, సంస్కృతిని నాశనం చేస్తే మట్టిలో కలిసిపోతారన్నారు. ప్రభుత్వం తీరుపై మేధావులు స్పందించాలన్నారు.