Coronavirus Updates in Andhra Pradesh: ఏపీలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక

Coronavirus Updates in Andhra Pradesh: ఏపీలో కరోనా రక్కసి జడలు విప్పి కరళానృత్యం చేస్తోంది. రోజుకు రోజుకు కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

Update: 2020-07-20 07:10 GMT
Coronavirus Updates in Andrapradesh

Coronavirus Updates in Andhra Pradesh: ఏపీలో కరోనా రక్కసి జడలు విప్పి కరళానృత్యం చేస్తోంది. రోజుకు రోజుకు కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. కరోనా కంట్రోల్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టినా వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరీ పరిస్థితిని చక్కదిద్దేదెలా.? వైరస్ ను కట్టడి చేసేదేలా.. మరీ ఈ సమస్యను వైద్యులు ఎలా సవాల్ చేస్తున్నారు.

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ మాత్రమే కరోనా నుంచీ కాపాడగలవంటున్నారు డాక్టర్లు. అవగాహన లోపంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు వైద్యులు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలుంటే సెల్ఫ్ మెడికలైజేషన్ మంచింది కాదంటున్నారు డాక్టర్లు. సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు.‌

నెగెటివ్ రిపోర్ట్ వచ్చినంత మాత్రాన కరోనాకి మనం దూరమైనట్టు కాదని హెచ్చరిస్తున్నారు సీనియర్ డాక్టర్లు. లాక్ డౌన్ తర్వాత అసలు కరోనా లేదన్నట్టు ప్రజలు వ్యవహరించడం వల్లే కేసులు

పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు. ఏదిఏమైనప్పటికీ, కరోనా రావడానికి మన అజాగ్రత్తలే ప్రధాన కారణాలు అంటున్నారు డాక్టర్లు. ఇప్పటికైనా ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 

Tags:    

Similar News