పోలీసు అమరవీరులకు సెల్యూట్‌: సీఎం జగన్‌

Update: 2019-10-21 05:11 GMT

విధి నిర్వాహణలో అసువులు బాసిన అమరవీరులకు ఏపీ సీఎం జగన్‌ నివాళులర్పించారు. విజయవాడలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఆయన రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాదికారాలకు నిదర్శనమన్నారు. అనంతరం 'అమరులు వారు' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

దేశంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటించిన రాష్ట్రం మనదేనన్నారు జగన్‌. రాత్రి, పగలన్న తేడా లేకుండా విధులు నిర్వహించే పోలీసులు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతుంటారని అంతటి త్యాగశీలులైన పోలీసులు వారంలో ఒక్కరోజైనా తమ కుటుంబంతో సంతోషంగా గడపాలన్న ఉద్దేశంతో వీక్లీ ఆఫ్‌ ప్రకటించినట్లు తెలిపారు.

చట్టం విషయంలో ఎవరికైనా రూల్..ఒకే చట్టం అనీ.. పేద..గొప్ప అనే తేడా చట్టం ముందు ఉండదన్నారు జగన్‌. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడుగు బలహీన వర్గాలను హింసించేవారిని వదలొద్దనీ పోలీసులకు ఆదేశించారు. లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఎవ్వరికీ ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.  

Tags:    

Similar News