టమోటా రైతుల సమస్యలపై సీఎం జగన్‌ ఆరా..తక్షణమే...

Update: 2019-10-19 10:06 GMT

కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటో రైతుల ఆందోళన, పంట కోనుగోలు, ధరల పతనంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. రైతుల ఇబ్బందులపై మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు మార్కెట్‌ యార్డ్‌లోనే రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని సూచించారు. దీంతో ఉదయం 9 గంటల సమయంలో టమాటో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు దగ్గరుండి వేలం పాటను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 50 టన్నుల టమాటోను వ్యాపారులు కొనుగోలు చేశారని అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఐదు టన్నుల టమాటోను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసింది. ధరల స్ధీరకరణ నిధి నుంచి రైతులకు చెల్లింపులు జరిపారు.

పండ్లు, కూరగాయలను డీ రెగ్యూలేట్ చేయడంతో రైతుల నుంచి టమాటో కొనుగోలును వ్యాపారులు నిలిపివేశారు. మార్కెట్ బయట మాత్రమే కొనుగోలు చేస్తామంటూ చెప్పడంతో రెండు రోజులుగా మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు తమను నిలువుదోపిడి చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర స్ధాయిలో ఉద్రిక్తత రేగింది. ఈ నేపధ్యంలోనే సీఎం జగన్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News