రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..

Update: 2019-12-10 11:00 GMT
ఆర్టీసీ

ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు, ఇంద్ర, ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం చార్జీలు పెంచలేదు.

అంతేకాకుండా, సిటీ బస్సులకు సంబంధించి 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదని ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పల్లెవెలుగు బస్సుల్లో మొదటి 2 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపుదల వర్తించదు. పల్లెవెలుగు బస్సుల్లో తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 పెంచుతున్నట్టు ఆర్టీసీ పేర్కొంది.

Tags:    

Similar News