మంగళగిరిలో ఇటీవల ప్రారంభించిన టీడీపీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ కార్యాలయ నిర్మాణంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి టీడీపీ కార్యాలయం నిర్మించారని పిల్‌లో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వంతో పాటు జల్లా కలెక్టర్, టీడీపీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.