దిశ చట్టం చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దిశ చట్టంను ఆమోదించారు. ఇక, దీని పైన చర్యల దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. దిశ చట్టానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దిశా చట్టం అమలు, పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారిణి దీపికను నియమించింది. స్త్రీ సంక్షేమ శాఖలో పని చేస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.