AP EAMCET Postponed: ఏపీలో ఎంసెట్ సహా అన్ని పరీక్షలు వాయిదా!

AP EAMCET Postponed: కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్ సహా ఎనిమిది సెట్లను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది

Update: 2020-07-13 15:25 GMT
ap eamcet

AP EAMCET Postponed: కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్ సహా ఎనిమిది సెట్లను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అయన వెల్లడించారు. అంచనా ప్రకారం సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక ఆన్‌లైన్‌ కోర్సుల విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

ఇక ఏపీ ఎంసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ముందుగా 167 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. వీటి సంఖ్య ప్రస్తుతానికి 146కి తగ్గింది. ప్రస్తుతం పరీక్ష కేంద్రాలను క్వారంటైన్ కేంద్రాలకు కేటాయించడంతో వీటి సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉండడంతో వాయిదాకే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఇక గత కొద్ది రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వాయిదా వేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1919 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ని పరీక్షించగా 1919 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. ఇక 1030 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 28,255. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,275కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 13,615 మంది చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News