AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అథ్లెట్ జ్యోతి యర్రాజీకి గ్రూప్-1 ఉద్యోగం.. టిడ్కోకు రూ.4,451 కోట్ల గ్యారెంటీ!
AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.
AP Cabinet Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కీలక తీర్మానాలు చేసింది.
క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి బంపర్ ఆఫర్
దేశ గర్వించదగ్గ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు విశాఖపట్నంలో 500 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్‌ను కేటాయిస్తూ మంత్రుల మండలి ఆమోదం తెలిపింది.
టిడ్కో ఇళ్లకు భారీ ఊతం
రాష్ట్రంలో టిడ్కో (TIDCO) గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
హడ్కో (HUDCO) నుంచి రూ.4,451 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్ల పంపిణీ జరిగే అవకాశం ఉంది.
వైద్యం మరియు మౌలిక సదుపాయాలు
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది.
టీటీడీ అప్‌గ్రేడ్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలో పని చేస్తున్న పలు పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలోని పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పలు సంస్థలకు భూములు కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంతో పాటు, ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.