నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం.. విలేఖరికి లీగల్ నోటీసులు ఇస్తా: రాజాం సీఐ అశోక్ కుమార్

రాజాం: తన నిజాయితీని దెబ్బతీసే విధంగా ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

Update: 2026-03-13 06:40 GMT

నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం.. విలేఖరికి లీగల్ నోటీసులు ఇస్తా: రాజాం సీఐ అశోక్ కుమార్

రాజాం: తన నిజాయితీని దెబ్బతీసే విధంగా ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "అశోకవనములో భక్షక బటులు" అనే శీర్షికతో వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు.

వ్యక్తిగత కక్షతోనే తప్పుడు వార్తలు:

ఒక భూ వివాదం విషయంలో సదరు విలేఖరి తనకు ఫోన్ చేసి, తన వారికి అనుకూలంగా వ్యవహరించాలని కోరినట్లు సీఐ వెల్లడించారు. అయితే, చట్టానికి విరుద్ధంగా ఏ పనీ చేయలేనని తాను తెగేసి చెప్పడంతో, ఆ విలేఖరి వ్యక్తిగత కక్ష పెంచుకుని తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ కథనం రాశారని ఆరోపించారు.

లీగల్ నోటీసులకు సిద్ధం:

తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న తనపై బురద చల్లడం సరికాదని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారానికి పాల్పడిన సదరు వ్యక్తికి త్వరలోనే లీగల్ నోటీసులు పంపనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

Tags:    

Similar News