Kukkunoor: కుక్కునూరులో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Update: 2026-03-12 17:05 GMT

Kukkunoor

Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్ మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, సామాన్య ప్రజల అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అప్పటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరయని, పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మరింత బలపడుతోందని, భవిష్యత్తులో కూడా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News