Palakonda: వంట గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు
Palakonda: వంట గ్యాస్ కొరత ఆందోళనల నేపథ్యంలో పాలకొండ తహసీల్దార్ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులతో ఆయన మాట్లాడారు
Palakonda
Palakonda: వంట గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక వెంకటేశ్వర గ్యాస్ ఏజన్సీలో ఆయన గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వంట గ్యాస్ వినియోగదారులతో మాట్లాడారు.
వంట గ్యాస్ దొరకదనే ఆందోళన చెందవద్దని, బుక్ చేసుకున్నవారందిరికీ గ్యాస్ సకాలంలో వస్తుందని ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి చెప్పారు. గ్యాస్ అధికధరకు విక్రయిస్తున్నారా? అని అక్కడ ఉన్న వినియోగదారులను ప్రశ్నించారు. వినియోగదారులంతా అటువంటిది ఏమీలేదని సమాధానమిచ్చారు.
గ్యాస్ బుక్ చేసుకున్నవారందరికీ సకాలంలో గ్యాస్ అందించాలని ఏజెన్సీ సిబ్బందికి ఆదేశాలు జరీ చేశారు రాధాకృష్ణమూర్తి. అదేవిధంగా సంక్షేమ గృహాలకు, హోటళ్లకు, అలాగే ప్రజల వినియోగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వంట గ్యాస్ కి సంబంధించి సమస్యలు ఎదురైతే పార్వతిపురం జిల్లా సివిల్ సప్లై అధికారుల కంట్రోల్ రూమ్7013060655 తెలియపరచాలన్నారు.