Padma Awards Telugu Winners 2026 List: పద్మ పురస్కారాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ.. నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్!
Padma Awards Telugu Winners 2026 List: 2026 పద్మ పురస్కారాల ప్రకటన: రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ సహా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 13 మంది ప్రముఖులకు వరించిన పద్మ అవార్డులు. పూర్తి జాబితా ఇక్కడ చూడండి.
Padma Awards Telugu Winners 2026 List: పద్మ పురస్కారాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ.. నోరి దత్తాత్రేయుడుకి పద్మభూషణ్!
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ అత్యున్నత పౌర పురస్కారాలైన 'పద్మ' అవార్డులను ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఈ ఏడాది మొత్తం 5 మందికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. ఇందులో ఏపీ, తెలంగాణ నుండి మొత్తం 13 మంది ఎంపికయ్యారు.
వైద్య రంగంలో నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని కేంద్రం 'పద్మభూషణ్' పురస్కారంతో గౌరవించింది. వైద్య రంగంలో ఆయన చేసిన నిరుపమాన సేవలకు గానూ ఈ గుర్తింపు లభించింది. అలాగే యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ గారు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.
కళాకారుల హవా.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు చోటు సినీ రంగం నుంచి 'నటకిరీటి' గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నటుడు మరియు మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లను 'పద్మశ్రీ' వరించింది. కళాకారుల విభాగంలో వీరిద్దరితో పాటు నృత్యకారిణి దీపికారెడ్డి కూడా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ గ్రహీతల పూర్తి జాబితా:
| విజేత పేరు | రంగం | రాష్ట్రం | అవార్డు |
| నోరి దత్తాత్రేయుడు | వైద్యం | అమెరికా (తెలుగు వ్యక్తి) | పద్మ భూషణ్ |
| గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ | కళలు (సినీ రంగం) | ఆంధ్రప్రదేశ్ | పద్మశ్రీ |
| మాగంటి మురళీ మోహన్ | కళలు (సినీ రంగం) | ఆంధ్రప్రదేశ్ | పద్మశ్రీ |
| దీపికా రెడ్డి | కళలు (కూచిపూడి నృత్యం) | తెలంగాణ | పద్మశ్రీ |
| పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి | వైద్యం (క్యాన్సర్ నిపుణులు) | తెలంగాణ | పద్మశ్రీ |
| గూడూరు వెంకట్ రావు | వైద్యం | తెలంగాణ | పద్మశ్రీ |
| మామిడాల జగదీశ్ కుమార్ | సాహిత్యం, విద్య | ఢిల్లీ కోటా (తెలంగాణ వ్యక్తి) | పద్మశ్రీ |
| కుమారస్వామి తంగరాజ్ | సైన్స్ అండ్ ఇంజినీరింగ్ | తెలంగాణ | పద్మశ్రీ |
| చంద్రమౌళి గడ్డమనుగు | సైన్స్ అండ్ ఇంజినీరింగ్ | తెలంగాణ | పద్మశ్రీ |
| కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ | సైన్స్ అండ్ ఇంజినీరింగ్ | తెలంగాణ | పద్మశ్రీ |
| గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) | కళలు (సంగీతం) | ఆంధ్రప్రదేశ్ | పద్మశ్రీ |
| వెంపటి కుటుంబ శాస్త్రి | సాహిత్యం, విద్య | ఆంధ్రప్రదేశ్ | పద్మశ్రీ |
| రామారెడ్డి మామిడి (మరణానంతరం) | పశుసంవర్ధక, పాడి పరిశ్రమ | తెలంగాణ | పద్మశ్రీ |