Guntur: ఓటుతోనే ప్రతి ఒక్కరికీ సమానత్వం – 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

Guntur: గుంటూరులో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఓటు హక్కు సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.

Update: 2026-01-25 10:49 GMT

Guntur: ఓటుతోనే ప్రతి ఒక్కరికీ సమానత్వం – 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు, ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం లభించిందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓటరు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. కుల, మత బేధాలు లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం ద్వారా సమాన అవకాశాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. అన్ని వర్గాలకు ఓటు హక్కును కల్పించిన ఘనత మన దేశానికి దక్కుతుందన్నారు. ఓటరుగా సమాజాన్ని తీర్చిదిద్దరంలో కీలక పాత్ర వహించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొన్నారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సమాజంలో సమూలమైన మార్పులకు నాంది పలకవచ్చని తెలిపారు. ఓటు నమోదు ప్రక్రియను సైతం ఎన్నికల కమిషన్ సులభతరం చేసిందని ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చని అన్నారు. ఓటరుగా నమోదు కాకుండా మిగిలి ఉన్న యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు ఒక వజ్రాయుధమని దాని విలువ ఎంతో గొప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు ప్రతి పౌరునిలో బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైనదని దానిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికీ అనేక మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని ఓటరు సరళి చూసినపుడు అవగాహన అవుతుందన్నారు. ఓటు వేయడం మన బాధ్యత, హక్కు అన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల ప్రక్రియ ఓటు హక్కు వలన సజావుగా సాగుతోందన్నారు. బూత్ స్థాయి అధికారులు ఓటు నమోదు ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు, ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఓటరు ప్రతిజ్ఞను చేయించారు. సీనియర్ ఓటర్లను సత్కరించారు. యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు

Tags:    

Similar News