Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 37 మంది మృతి..

Arun Chilukuri
Published on: 13 July 2020 5:48 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. ఒక్కరోజే 37 మంది మృతి..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1919 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ని పరీక్షించగా 1919 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 1030 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్టణంలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 28,255. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 365. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,275కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 13,615 మంది చికిత్స పొందుతున్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story