AP social media ban: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?
AP social media ban: ఏపీలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆస్ట్రేలియా అండర్-16 చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
AP social media ban: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం?
AP social media ban: సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు కంటే నష్టం ఎక్కువగా జరుగుతోందన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్, హానికరమైన వీడియోలు, మైనర్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశాలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలన్న చర్చలు తెరపైకి వచ్చాయి.
ఇప్పటికే కొన్ని దేశాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ దిశగా చర్యలు తీసుకునే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గత వారం దావోస్ పర్యటనకు వెళ్లిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పిల్లల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న అండర్-16 సోషల్ మీడియా చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలపై అధ్యయనం జరుగుతోందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ నిబంధనలు అమలులోకి వస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ల వాడకంపై మైనర్లకు కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాగే నిబంధనలు పాటించని టెక్ కంపెనీలపై భారీ జరిమానాలు విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ చట్టం అమలైతే దేశంలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా నియంత్రణకు ఇది కీలకమైన అడుగుగా మారే అవకాశముంది.