CM Chandrababu Naidu: అమరావతి చరిత్రలో మరో మైలురాయి.. రాజధానిలో మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
CM Chandrababu Naidu: అమరావతి గడ్డపై తొలిసారిగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, ప్రజా రాజధానిలో మువ్వన్నెల జెండా ఎగరడం గర్వకారణమని పేర్కొన్నారు.
CM Chandrababu Naidu: అమరావతి చరిత్రలో మరో మైలురాయి.. రాజధానిలో మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ అధికారికంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా స్పందించారు.
చారిత్రాత్మక ఘట్టం: "ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఒక అద్భుతమైన ఘట్టం. ఈ ఏడాది రిపబ్లిక్ డే రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా మిగిలిపోతుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు. మువ్వన్నెల జెండా సాక్షిగా అమరావతి గడ్డపై ఆత్మాభిమానం చాటుకున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగంపై ప్రశంసలు: ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణను ప్రతిబింబించిందని సీఎం కొనియాడారు. ప్రభుత్వ ఆశయాలను, ఎజెండాను ప్రజలకు స్పష్టంగా వివరించినందుకు గవర్నర్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
శకటాల ప్రదర్శన - భవిష్యత్ దృక్పథం: గ్రాండ్ పరేడ్‌లో భాగంగా ప్రదర్శించిన వివిధ శాఖల శకటాలు రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ వేడుకలు మన సమష్టి ఆశయాలకు ప్రతీకలని పేర్కొంటూ, ప్రతి పౌరుడిలో దేశభక్తిని నింపేలా ఈ కార్యక్రమం సాగిందని కొనియాడారు. చివరగా 'జై హింద్' అంటూ తన ప్రకటనను ముగించారు.