APSRTC Recruitment: నిరుద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. 7,673 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి కసరత్తు
APSRTC Recruitment 2026: ఏపీఎస్‌ఆర్టీసీలో భారీ ఉద్యోగాల భర్తీ. 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి ఆర్టీసీ బోర్డు ఆమోదం. స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్ పోస్టుల భర్తీకి కసరత్తు.
APSRTC Recruitment: నిరుద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. 7,673 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి కసరత్తు
APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకాన్ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది.
భారీగా ఖాళీల భర్తీ: సంస్థలో ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ పాలకమండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ నియామకాల ప్రక్రియకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు: మొత్తం 7,673 ఖాళీలలో ప్రధానంగా ఉన్న పోస్టులు ఇవే:
రెగ్యులర్ డ్రైవర్లు: 3,673 పోస్టులు
కండక్టర్లు: 1,813 పోస్టులు
సాంకేతిక సిబ్బంది: మెకానిక్‌లు, శ్రామిక్‌లు మరియు ఇతర విభాగాలు.
సిబ్బందికి వేతనాల పెంపు:
కొత్త నియామకాలతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందికి కూడా ఆర్టీసీ మేలు చేకూర్చింది.
♦ ఆన్‌కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని రూ. 800 నుంచి రూ. 1,000 కు పెంచింది.
♦ డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే అదనపు మొత్తాన్ని రూ. 900 కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్త్రీ శక్తి పథకానికి ఊతం: మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సర్వీసులను మరింత మెరుగుపరచడానికి అదనపు బస్సులు మరియు సిబ్బంది అవసరం ఏర్పడింది. ఈ నియామకాలు పూర్తయితే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.