రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

Update: 2020-01-10 05:38 GMT
రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలింపు ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల చెబుతున్నారు. రాజధానిలో గోపి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా గోపి అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నాడని ఉపాధి లేక రాజధాని తరలింపుతో తీవ్ర మనస్థాపంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంసభ్యులు చెబుతున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అమరావతి రాజధాని గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మహిళలు చేపట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

Tags:    

Similar News