అమరావతి రైతుల కోసం నారా రోహిత్

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీళ్లేదని అమరావతిలోని రైతులు ఆందోళన చేపడుతున్నా సంగతి తెలిసిందే..దీనితో అక్కడి రైతులకి తెలుగుదేశం పార్టీ

Update: 2020-01-09 13:30 GMT
Nara rohit

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీళ్లేదని అమరావతిలోని రైతులు ఆందోళన చేపడుతున్నా సంగతి తెలిసిందే..దీనితో అక్కడి రైతులకి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుంది. వారి తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేపడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయిడు తమ్ముడి కుమారుడు అయిన నారా రోహిత్ రైతుల పోరాటం వృథా కాదని, త్వరలోనే వారి పోరాటంలో కూడా నేను కూడా భాగస్వామిని అవుతానని అయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

"ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను" అయన పోస్ట్ చేశారు.

ఇక గురువారం రోజు రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి బిక్షాటన చేశారు. మచిలీపట్నం చేరుకున్న ఆయన కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలి పట్టుకుని భిక్షాటన చేశారు. చంద్రబాబుతో పార్టీ సీనియర్ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా "మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు" అంటూ నినాదాలు చేశారు.

Full View

Tags:    

Similar News