ట్యూషన్ కొంప ముంచింది.. ఒకేసారి 30 మందికి కరోనా!

Coronavirus In Bhataluru Village : ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికి అంతే స్థాయిలో రికవరీ రేటు ఉండడం ఆశాజనకంగా ఉంది. అయితే కేసులు పెరగడానికి నిర్లక్షమే కారణమని అధికారులు అంటున్నారు.

Update: 2020-10-02 07:58 GMT

Coronavirus 

Coronavirus In Bhataluru Village : ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికి అంతే స్థాయిలో రికవరీ రేటు ఉండడం ఆశాజనకంగా ఉంది. అయితే కేసులు పెరగడానికి నిర్లక్షమే కారణమని అధికారులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనాని పూర్తిగా అడ్డుకోవచ్చునని అంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా గుంటూరులో ట్యూషన్ కొంప ముంచింది . ఒకరి నుంచి మరొకరికి సోకుతూ అలా 30 మందికి కరోనా సోకింది. ఇక ఆ గ్రామంలో ఒకే రోజు ఏకంగా 39 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలో ఓ టీచర్ ట్యూషన్ నిర్వహిస్తున్నారు.. మొత్తం ఈ ట్యూషన్ కి మొత్తం 50 మంది ట్యూషన్ కి వస్తున్నారు. అయితే తాజాగా ఆ టీచర్ కి కరోనా సోకింది.. ఆ టీచర్ నుంచి మెల్లిగా మరో 14మంది విద్యార్థులకు కూడా కరోనా సోకింది. అలా విద్యార్దుల నుంచి కొంతమంది తల్లిదండ్రులకు వైరస్ సోకింది..

అయితే కరోనా బారిన పడిన విద్యార్థులంతా ఏడేళ్లలోపు వారే కావడం ఆందోళనకి గురి చేస్తోంది. ప్రస్తుతం వారిని గుంటూరు క్వారంటైన్‌కు తరలించారు. తల్లిదండ్రుల్ని మాత్రం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇలా మొత్తం ఆ గ్రామంలో ఒకే రోజు 39 కరోనా కేసులు నమోదయ్యాయి. దీని పైన గుంటూరు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎవరైనా ట్యూషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అటు ఎపీలోను కరోనా కేసులు విషయానికి వచ్చేసరికి గురువారం సాయింత్రం నాటికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 6,751 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 6,97,340కి చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకొని 7,297 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 57,858 మంది చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News