ఏపీలో కొత్తగా 6,751 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 1 Oct 2020 6:06 PM IST
ఏపీలో కొత్తగా 6,751 కరోనా కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,577 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,751 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 7,297 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో 7 మంది, కృష్ణా 6, ప్రకాశం 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, పశ్చిమగోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 6,97,340 . ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,869. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,33,613కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 57,858 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58,78,135 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story