Simhachalam: ముగిసిన ఏకాదశి పూజలు.. అప్పన్న చందనోత్సవ పనులు ప్రారంభం!
Simhachalam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం ఈనెల 20న జరగనుంది. ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Simhachalam: ముగిసిన ఏకాదశి పూజలు.. అప్పన్న చందనోత్సవ పనులు ప్రారంభం!
సింహాచలం: ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈనెల 20న సింహాద్రి నాధుడు చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.. ప్రతి ఏటా వైశాక శుద్ధ తదియనాడు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకముగా నిర్వహించనున్నారు.. ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో జే వెంకటరావు ఆధ్వర్యంలో శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
తొలి విడత చందనం అరగదీత*ప్రారంభం
చందనోత్సవం రోజు రాత్రికి భక్తులు దర్శనాలు అనంతరం తొలివిడతగా సింహాద్రినాధుడుకి మూడు మనుగులు చందనాన్ని వైభవంగా సమర్పించనున్నారు..
దీంతో సోమవారం వైశాఖ మాసం ఏకాదశి పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున ప్రత్యేక పూజలు అనంతరం తొలి విడతగా చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభించారు.. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసచార్యులు.. కరి సీతారామాచార్యులు.. స్థానా చార్యులు టి పి రాజగోపాల్ ఆలయ ఈవో జే వెంకట్రావు, ఏ ఈ ఓ తిరుమ లేశ్వరరావు.. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు చందనము అరగదీత కార్యక్రమంలో పాల్గొన్నారు.. తొలుత అర్చక వర్గాలు చందనం అరగదీత..ప్రారంభించారు..
అత్యంత మహిమాన్వితమైన సింహాద్రినాథుడి ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు చెప్పారు.