Anakapalle: అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందడి

Anakapalle: అనకాపల్లి భీముని గుమ్మంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Update: 2026-04-12 10:13 GMT

Anakapalle: అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందడి

Anakapalle: దళిత హక్కుల ప్రధాత ఈ దేశ సామాజిక రాజకీయ స్థితిగతులను సమూలంగా ప్రక్షాళన చేసిన విప్లవ సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135వ జయంతి వేడుకలు స్థానిక భీముని గుమ్మం ఆది ఆంధ్ర సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ఆదిఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్ , గౌరవ అధ్యక్షులు లంబ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు మీడియా సమావేశంలో తెలిపారు.

పి వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా 11వ తేదీ నాడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జీవీఎంసీ అంబేద్కర్ స్కూల్లో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు పోస్టర్ను ఆవిష్కరించారు.

12వ తేదీ నాడు సామ్రాట్ అశోక చక్ర అవార్డు గ్రహీత బహుజన కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా గాయకుడు ఉదయ భాస్కర్ బృందం చే సాంస్కృతి కార్యక్రమం 13వ తేదీ నాడు మహిళలకు ముగ్గులు పోటీలు 14వ తేదీ నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నవ్వాలనిపించడానికి వస్తున్నారని తెలిపారు. సాయంత్రం పలు సంస్కృతి కార్యక్రమాలతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టణంలోని ఊరేగిస్తున్నామని తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అనకాపల్లి భీముని గుమ్మంలో పర్యటించినందుకు అప్పటినుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంగం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్రప్రసాద్, ముఖ్య సలహాదారులు మైళ్ళపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షులు సబ్బవరపు గణేష్, కార్యదర్శి పూతల శ్రీనివాసరావు, ట్రెజరర్ పందిరి దయ్యాల రాజ్,

ఉపాధ్యక్షులు సమ్మంగి కనకారావు, సహాయ కార్యదర్శి కూరాకుల దేవి ప్రసాద్, గొర్లి వెంకట బాలసుబ్రమణ్యం, సమన్వయ కార్యదర్శి కటారి మహేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్లి శివరాజ్, సిమ్మిటి రామకృష్ణ, తెరపల్లి మణికుమార్, కమిటీ సభ్యులు పందిరి నర్సింగరావు, బెల్లం శ్రీనివాసరావు, కసింకోట అప్పారావు, నేతల రాము, దౌర్ల కిషోర్ ,పిట్ట మారయ్య, చింతల రామకృష్ణ, గొర్లి చిన్న నూకరాజు ,మాదాల విజయ్, గెలకల కిరణ్ ,చెక్కబుజ్జి ,గాలి కనకమాలక్ష్మి రావు, మాటూరు ఈశ్వరరావు పాల్గొన్నారు.

Tags:    

Similar News