Prakasam: మార్కాపురంలో పోలీసుల పంజా.. హోటల్ గదిలో పేకాట రాయుళ్ల అరెస్ట్!

Prakasam: మార్కాపురం పట్టణంలోని మాధవి గ్రాండ్ హోటల్‌లో సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

Update: 2026-04-12 06:05 GMT

Prakasam: మార్కాపురంలో పోలీసుల పంజా.. హోటల్ గదిలో పేకాట రాయుళ్ల అరెస్ట్!

Prakasam: మార్కాపురం పట్టణంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.

డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సమాచారం మేరకు ఈరోజు (11-04-2026) సాయంత్రం సుమారు 3:30 గంటలకు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవి గ్రాండ్ హోటల్‌లో రూరల్ ఎస్సై, అర్ధవీడు ఎస్సైలు మరియు సిబ్బంది కలిసి రైడ్ నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న 17 మందిని పట్టుకుని, వారి వద్ద ఉన్న రూ.63,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News