Jagtial: వెల్గటూర్‌లో దారుణం.. అత్తను చంపేందుకు విద్యుత్ షాక్ ప్లాన్!

Jagtial: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో భార్యను కాపురానికి పంపడం లేదని అత్త రాజవ్వపై అల్లుడు మల్లారెడ్డి విద్యుత్ షాక్‌తో హత్యాయత్నం చేశాడు.

Update: 2026-04-12 07:47 GMT

Jagtial: వెల్గటూర్‌లో దారుణం.. అత్తను చంపేందుకు విద్యుత్ షాక్ ప్లాన్!

Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు..

నిండుతుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీసులు..

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి 48 పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు సంతానం ఉండగా భార్య భర్తల మధ్య తరచు గొడవలు కాగా తన పిల్లలతో పుట్టింటికి వెళ్ళిన భార్య పద్మ..

తన భార్య పద్మ తల్లి రాజవ్వ ఎంత చెప్పినా కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని అత్త రాజవ్వను హతమార్చలని ప్లాన్ వేసుకుని అత్త రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చి హత్య చేయలనుకొని విద్యుత్ అమర్చాడు..రాజవ్వ ఉదయం తలుపులు తీయడానికి ప్రయత్నం చేయగా స్వల్పంగా తగిలిన విద్యుత్ షాక్ తగిలింది.. చుట్టుపక్కల వారిని పిలువగా అమర్చిన విద్యుత్ తీగలను తొలగించారు..

పోలీస్ స్టేషన్లో అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రీమాండ్ కు పంపిన పోలీసులు.

Tags:    

Similar News