Choppadandi: క్రీడలతోనే క్రమశిక్షణ.. రేవెల్లి యువతకు ఎస్సై పిలుపు
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లిలో అంబేద్కర్ జయంతి క్రికెట్ పోటీలను ఎస్సై నరేష్ రెడ్డి ప్రారంభించారు.
Choppadandi: క్రీడలతోనే క్రమశిక్షణ.. రేవెల్లి యువతకు ఎస్సై పిలుపు
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లి గ్రామంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎస్సై నరేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గెలుపు మనకు ఆనందాన్ని ఇస్తే, ఓటమి మనకు అనుభవాన్ని నేర్పుతుందని తెలిపారు. క్రీడాకారులు ఈ భావనతో ముందుకు సాగితేనే జీవితంలో విజయాలను సాధించగలరని సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని యువత క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆయన కోరారు. క్రమశిక్షణ, పట్టుదల, కృషి ఉంటే ఎవరికైనా ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రేవెల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎస్సై ప్రశంసించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.