Karimnagar: నేనూ ఆయిల్ పామ్ సాగు చేస్తా.. రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు!
Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
Karimnagar: నేనూ ఆయిల్ పామ్ సాగు చేస్తా.. రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు!
కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థలాన్ని పరిశీలించి, రైతు వేదికలో రాయితీ పై వ్యవసాయ శాఖ పరికరాలను రైతులకు మంత్రి పంపిణీ చేసారు.
మంత్రి మాట్లాడుతూ
వ్యవసాయ శాఖ తరుపున చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నాం.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం, ఎక్కడ ఇబ్బందులు లేవు.నేను కూడా ఆయిల్ ఫాం సాగు చేస్తా,5 ఎకరాల పైన ఉన్న వారు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి.చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు.
ఆయిల్ ఫాం సాగు వల్ల ప్రకృతి ఇబ్బందులు, కోతుల ఇబ్బందులు ఉండవు.దానిపై నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విజిట్ చేయండి.సాగు నీరు కాలువలు పూర్తయ్యేలా చేస్తున్నాం,ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సమావేశం జరిగింది, త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
త్వరలోనే పేమెంట్ పూర్తి చేస్తాం, అందరూ కాలువకు భూమి ఇవ్వాలని కోరారు.
చిగురు మామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కి 4 ఎకరాల స్థలంను చూస్తున్నామని,
రేకొండ భూసమస్య పై ముఖ్యమంత్రి ని కలిసామన్నారు.