Pothkapalli: ఆలయాలు, ఇళ్లే లక్ష్యం.. పాత నేరస్తుడిని ఆటకట్టించిన పోలీసులు!
Pothkapalli: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆలయాలు, ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు గుంటి శ్రావణ్‌ను పోత్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
Pothkapalli: ఆలయాలు, ఇళ్లే లక్ష్యం.. పాత నేరస్తుడిని ఆటకట్టించిన పోలీసులు!
Pothkapalli: రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలతో కలకలం రేపుతున్న పాత నేరస్తుడు గుంటి శ్రావణ్‌ను పోత్కపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో దొరికిపోయిన దొంగ:
పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తన సిబ్బందితో కలిసి శనగుండ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న గుంటి శ్రావణ్‌ను ఆపి విచారించారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, అసలు విషయం బయటపడింది. ఓదెల మండలం శానగుండ గ్రామానికి చెందిన శ్రావణ్, గతంలో అనేక చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.
చోరీల వివరాలు:
పోత్కపల్లి పరిధిలోని జీలకుంట ఎల్లమ్మ ఆలయంలో చోరీ. గుండ్లపల్లి, బయమ్మపల్లి, పోత్కపల్లి గ్రామాల్లో రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలు. హైదరాబాద్‌లోని కాచిగూడ, కుషాయిగూడ మరియు దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు.
రికవరీ చేసిన సొత్తు:
5 గ్రాముల బంగారం (రెండు పుస్తెలు, ఒక ముక్కుపుడక). 14 తులాల వెండి ఆభరణాలు మరియు ముక్కలు. 3 ద్విచక్ర వాహనాలు. వేసవిలో అప్రమత్తంగా ఉండండి: ఎస్సై దీకొండ రమేష్ ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు ఊర్లకు వెళ్లేటప్పుడు విలువైన బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం ద్వారా గస్తీ పెంచే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.