Bodhan: జనగణన పేరుతో వచ్చి నిలువునా దోచేశారు!
Bodhan: బోధన్ గౌడ్స్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. జనగణన పేరుతో ఇంట్లోకి ప్రవేశించి మహిళను బంధించి 5 తులాల బంగారం, 68 తులాల వెండి దోచుకెళ్లారు.
Bodhan: జనగణన పేరుతో వచ్చి నిలువునా దోచేశారు!
Bodhan: పట్టణంలోని గౌడ్స్ కాలనీలో దొంగలు శనివారం మధ్యాహ్నం హల్చల్ చేశారు. జనగణన పేరుతో కాలినీలో పర్యటించిన దుండగులు ఒక ఇంట్లో చేరబడి మహిళ మెడలో నుంచి ఐదు తులాల బంగారాన్ని 68 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. జనగణన పేరుతో మౌనిక అనే మహిళ ఇంటి వద్దకు వెళ్లి తాము జనగణన పేరుతో వివరాలు సేకరించెందుకు వచ్చామని దాహాంగా ఉంది మంచినీళ్లు ఇవ్వాలని మహిళను కోరారు.
మౌనిక కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు పుస్తెలతాడు, కమ్మలు, ఇంట్ వెండి పల్లెలతో పాటు బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కాళ్లు చేతులు కట్టిన దుండగులు చంపుతామని బెదిరిస్తూ బంగారు వెండి ఆభరణాలను దూసుకెళ్లి నట్లు బాధితురాలు పేర్కొంది.
విషయాన్ని పట్టణ సిఐ వెంకటనారాయణ కు తెలుపగా ఘటన స్థలానికి చేరుకున్న సిఐ వివరాలు సేకరించారు. దుండగుల కోసం గాలిపు చర్యలను ముమ్మరం చేశారు. అపరిచిత వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చినట్లయితే 100 ఒక సమాచారం అందించాలని సిఐ పేర్కొన్నారు.