Narsapur: ఘోర ప్రమాదం.. లారీ రాంగ్ పార్కింగ్ వల్లే అనర్థం

Narsapur: నర్సాపూర్ రెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీ రాంగ్ పార్కింగ్ వల్ల రెండు బైకులు, ఒక కారు ఢీకొన్నాయి.

Update: 2026-04-11 15:38 GMT

Narsapur: ఘోర ప్రమాదం.. లారీ రాంగ్ పార్కింగ్ వల్లే అనర్థం

Narsapur: నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి సమీపంలో శనివారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ తరలించారు.

నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి సమీపంలో మొదటగా రెండు బైకులు ఢీ కొనడం తో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. బైక్ లను తప్పించబోయి కార్ అదుపు తప్పి కిందకి వెళ్ళిపోయింది..జాతీయ రహదారి 765 డి పై మెదక్ నర్సాపూర్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై లారీ రాంగ్ రూట్ లో పార్క్ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందరు కౌడిపల్లి మండలం చుట్టు పక్కల గ్రామాలకి చెందిన వారు.

Tags:    

Similar News